జయచిత్ర తల్లి కూడా టాప్ హీరోయిన్…ఆమె ఎవరో మీకు తెలుసా ?
Tollywood Actress Jayachitra :అందాల నటుడు శోభన్ బాబు నటించిన సోగ్గాడు మూవీతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జయచిత్ర ఆ చిత్రంలో నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆతరువాత చిల్లరకొట్టు చిట్టెమ్మ,రిక్షా రాజా చిత్రాలతో ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. నిజానికి ఈమె ఆరేళ్ళ వయస్సులో భక్తపోతన మూవీతో వెండితెరకు పరిచయం అయింది. కాకినాడకు చెందిన ఈమె అసలు పేరు లక్ష్మీ రోషిణి కృష్ణవేణి. కోరతి మొగం అనే తమిళ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది. మొదటినుంచి పాత్రకు ప్రాధాన్యం గల పాత్రలను ఎంచుకుని సినిమాల్లో నిలదొక్కుకుంది.
తెలుగు, తమిళ భాషల్లో చాలాకాలం అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించిన జయచిత్ర మంచి పేరు తెచ్చుకుంది. ఇక జయచిత్ర ప్రముఖ వ్యాపార వేత్త గణేష్ ని పెళ్ళాడి సెటిల్ అయింది. అయితే మళ్ళీ ఆమధ్య క్యారక్టర్ రోల్స్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి బాగానే ఆకట్టుకుంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన అబ్బాయి గారు మూవీలో వెంకటేష్ తల్లిగా, మీనాకు పొగరుబోతు అత్తగా జయచిత్ర చేసిన నటన తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. జయచిత్ర కూడా నట వారసత్వాన్ని నిలబెట్టాలని ఆమె కొడుకు ఆమ్రేష్ ని హీరో గా పెట్టి జయచిత్ర నిర్మాణంలో ఆమె స్వయంగా దర్శకత్వం వహించింది. అతని కెరీర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది.
అయితే ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు విడుదల కాలేదు. దీంతో ఆమె ఆర్ధికంగా బాగా నష్టపోవడమే కాకుండా మానసికంగా కుంగిపోయింది.
ఒకప్పుడు రిచ్ గా బతికిన జయచిత్ర ఇప్పుడు 60 ఏళ్ళ వయసులో ఎవరైనా క్యారెక్టర్ రోల్స్ ఇస్తే బాగున్ను అని ఎదురుచూస్తూ దయనీయంగా బతుకు వెళ్లదీస్తోంది. హీరోయిన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి,ఇప్పుడు బామ్మ , అమ్మమ్మ పాత్రలతో నెట్టుకొస్తోంది.
ప్రస్తుతం తమిళ చిత్రంలో ఓ చిన్న రోల్ వేస్తోంది. జయచిత్ర తండ్రి మహేంద్ర పశువైద్యుడు. తల్లి జయశ్రీ కూడా తమిళంలో నటి. ఈమెకు అమ్మాజీ అనే పేరుంది. జయశ్రీ ఎన్టీఆర్ తో కల్సి రాజు పేద సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే అక్కినేనితో రోజులు మారాయి,పాండురంగ మహత్యం చిత్రాల్లో నటించింది. ఇక దైవబలం,మహావీరన్ వంటి తమిళ మూవీస్ లో నటించింది.