దూరదర్శన్ లో కాదన్నారు .. సినిమా తీసి హిట్ కొట్టారు…సినిమా ఏమిటో…?
itlu sravani subramanyam Movie : ఇండస్ట్రీలో కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒకచోట కాదన్నది మరొక చోట అవుననే విధంగా ఉంటుంది. ఆదరణ ఉంటుందని చెప్పవచ్చు. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విజయాలతో పాటు ప్లాప్ లు అందుకున్నప్పటికీ క్రేజీ డైరెక్టర్ గా ఆడియన్స్ లో మిగిలాడు. ఇతడి స్టైలిష్,టేకింగ్ సెపరేట్ అని చెప్పవచ్చు. సూపర్ స్టార్ కృష్ణతో సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చిన పూరి అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి మూవీ తీసి, తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి మూవీ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రామ్ చరణ్ తో చిరుత, బన్నీతో దేశముదురు..ఇలా వరుస హిట్ మూవీస్ చూస్తే, హీరోలను వెండితెరపై ఎలా చూపించాలో ఆడియన్స్, ఫాన్స్ నాడి పూర్తిగా తెల్సిన డైరెక్టర్ గా ముద్ర పడ్డాడు.అయితే అంతకు ముందు దూరదర్శన్ లో కథలు అందించేవాడు. సినిమా మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాడు. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ కొన్ని స్టోరీస్ సిద్ధం చేసుకునేవాడు.
అయితే కొండచరియ అనే కథ రాసి, సీరియల్ కోసం పంపిస్తే దూరదర్శన్ వాళ్ళు రిజెక్ట్ చేసారు. ఈలోగా సినిమాల్లోకి వచ్చి,బద్రీ తో హిట్ కొట్టాడు. అయితే కొండచరియ సీరియల్ కి కొన్ని మార్పులు చేసి,ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఈ సినిమాకు సుమంత్, తరుణ్ లను అనుకుంటే వాళ్ళు నో చెప్పడంతో రవితేజతో తీశాడు. ప్రత్యుషను హీరోయిన్ గా అనుకుంటే డేట్స్ కుదరలేదు. దాంతో ఇండస్ట్రీలో ఛాన్స్ ల కోసం చూసి, వెనుదిరిగి వెళ్లిపోదామనుకున్న తనూరాయ్ కి ఇందులో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. చక్రి మ్యూజిక్ అందించిన ఈ మూవీ సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. మొత్తానికి సెన్షేషన్ హిట్ కొట్టాడు పూరి.