MoviesTollywood news in telugu

పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ భామను గుర్తు పట్టారా…?

Tollywood Heroine nidhi agarwal : సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో హీరో, హీరోయిన్స్ గురించి ఏ చిన్న వార్త అయిన అభిమానులకు తెలుస్తుంది. దీనికి తోడుఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఖాతాల ద్వారా వీడియోలు, ఫోటోలు షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ చిన్ననాటి ఫోటో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు మూవీలో హీరోయిన్ గా నిధి ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అయితే ఈ బ్యూటీ నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్న నిధి ఇటీవల తమిళంలో జయం రవి హీరోగా చేసిన భూమి మూవీలో నటించింది. ఈ మూవీతో నిధి అగర్వాల్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక గతంలో నాగసౌర్య హీరోగా నటించిన చిత్రంలో కూడా చేసింది. ఇప్పుడు పవర్ స్టార్ సరసన చేస్తోంది. ఈ అమ్మడు చిన్నప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫోటో వైరల్ అవ్వడంతో పలువురు క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."