అల్లు అర్జున్ తో జోడీ కట్టిన హీరోయిన్స్ ఇప్పుడు ఏమి చేస్తున్నారో…?

Allu Arjun Movie heroines :సాధారణంగా ఓ మూవీ హిట్ అయితే హీరోతో పాటు మిగిలిన వాళ్లకు కూడా పేరొస్తోంది. హీరోయిన్స్ కి మంచి పేరు వచ్చి స్టార్ స్టేటస్ తో దూసుకెళ్తారు. అయితే అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ కెరీర్ లో హీరోయిన్స్ సినిమా సినిమాకు మారిపోతుంటారు. అదే సమయంలో సదరు హీరోయిన్స్ లో కొందరు కనుమరుగైపోతుంటారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో గంగోత్రి మూవీతో అల్లు అర్జున్ హీరోగా తెరంగేట్రం చేసాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో,బన్నీకి మంచి క్రేజ్ వచ్చింది.

అయితే గంగోత్రిలో చేసిన ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ కి అనుకున్న స్థాయిలో గుర్తింపు,ఛాన్స్ లు రాలేదు. ఇక ఆర్య మూవీలో అనురాధ మెహతా నటించింది. అల్లు అర్జున్ కి క్రేజ్ హెచ్చింది. అయితే అది మెహతాకు ఈ హిట్ దోహదపడలేదు. ఇక వివి వినాయక్ డైరెక్షన్ లో చేసిన బన్నీ మూవీలో గౌరీ ముంజల్ హీరోయిన్. ఈ సినిమా బన్నీకి స్టార్ హోదా తెచ్చినప్పటికీ హీరోయిన్ కి ఏమాత్రం ఛాన్స్ లు ఇప్పించ లేకపోయింది.

ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన దేశముదురు మూవీ లో అల్లు అర్జున్ యాక్షన్ అదరగొట్టాడు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ హన్సిక కు కూడా మంచి గుర్తింపు లభించింది. అయితే తెలుగులో ఈమెకు స్టార్ స్టేటస్ రాలేదు. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన వరుడు మూవీలో భాను శ్రీ మెహ్రా హీరోయిన్ గా చేసింది. సినిమా పెద్దగా ఆడలేదు. ఇక హీరోయిన్ కి ఛాన్స్ లు కూడా రాలేదు.