బిజీగా మారిన టాలీవుడ్ హీరోయిన్స్…నటిస్తున్న సినిమాలు ఇవే…?

Tollywood star heroines movie offers :కరోనా లాక్ డౌన్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బన్నీ, మహేష్ బాబు ఇలా హీరోలందరూ బిజీగానే ఉంటున్నారు, ఇక హీరోయిన్స్ కూడా బిజీగా మారారు. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న సర్కారువారి పాట మూవీలో చేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కొండపొలం మూవీ రిలీజ్ రెడీగా ఉండగా,తమిళ,హిందీ రంగాల్లో 6 సినిమాలు చేతిలో ఉన్నాయి.

ఇక పూజా హెడ్గే గత ఏడాది సంక్రాంతికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో మూవీ ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈమెకు మంచి గిరాకీ ఏర్పడింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్,ఆచార్య,రాధేశ్యాం మూవీస్ పూర్తిచేసి, మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు, బాలీవుడ్ లో రణబీర్ సింగ్, సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ కి జోడీగా పూజా నటిస్తోంది.

సరిలేరు నీకెవ్వరూ,భీష్మ మూవీస్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు, పుష్ప మూవీస్ లో నటిస్తోంది .మిషన్ మజ్ను, గుడ్ బై మూవీస్ కూడా ఆమె చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సీనియర్ హీరోయిన్ శృతిహాసన్ కి సలార్ మూవీ మాత్రమే ఉంది.

మంచి రోజులు వచ్చాయి, ఎఫ్ 3మూవీస్ తో మెహ్రీన్ బిజీగా ఉంది. పక్కా కమర్షియల్, థ్యాంక్యూ మూవీస్ తో రాశీఖన్నా బిజీగానే ఉంది. మలయాళం, తమిళ్ సినిమాల్లో కూడా చేస్తోంది. మాస్ట్రో, సిటీమార్ మూవీస్ పూర్తిచేసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఎఫ్ 3,శీతాకాలం గుర్తుందా మూవీస్ లో నటిస్తోంది. ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతిశెట్టి కి ఇంకా ఆఫర్లు రావాల్సి ఉంది.