తమన్నా ప్రతి రోజు ఆ జ్యూస్ తాగుతుందట…ఎందుకో తెలుసా?

Tollywood Heroine tamannah bhatia :ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీలో నటించి పాపులార్టీ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా మరోవేపు మెగాస్టార్ నటిచిన సైరా మూవీలో కూడా చేసి, మంచి మార్కులు కొట్టేసింది. అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న తమన్నా ఇటీవలె మాస్ట్రో సినిమాలో నెగెటివ్ షేడ్ లో నటించి అలరించింది. శ్రీ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు అవుతున్నా సరే, విభిన్న పాత్రలతో అలరిస్తూ,ఇప్పటికీ టాప్‌ హీరోయిన్‌గా ఉంటోంది.

అయితే ఆమె గురించి ఓ వార్త ఫాన్స్ ని షాక్ కి గురి చేసింది. అదేంటంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ . కొన్నాళ్లుగా తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పింది. అయితే తనకున్న ఆరోగ్య సమస్య ఏంటన్న దాన్ని మాత్రం బయటపెట్టలేదు. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎక్కువగా వర్కవుట్స్‌ చేయడం, ఒత్తిడి కారణంగా ఓ అనారోగ్య సమస్యను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.

అయితే నిపుణుల సూచనలతో వ్యాయామాలు చేస్తున్నానని తమన్నా చెప్పింది. ప్రస్తుతం సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ, క్రమం తప్పకుండా నోని లేదా తొగరి ఫలం జ్యూస్‌ తీసుకోవడం వలన తాను ఆ సమస్య నుంచి బయటపడేందుకు వీలవుతుందని తమన్నా చెప్పింది. అలాగే ప్రతిరోజు ఉసిరి రసం, బాదం పాలు, పసుపు, కొబ్బరి నీళ్లు తన డైట్‌లో ఉండేలా చూసుకుంటానని చెప్పింది. ఫిట్‌గా,స్లిమ్‌గా ఉండేందుకు లిక్విడ్‌ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు వివరించింది.