Healthhealth tips in telugu

1 గ్లాసు – కిడ్నీ సమస్యలు,నరాల బలహీనత,అధిక బరువు,కొలెస్ట్రాల్,జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది

kidney problems Home remedies In Telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంగారూ పడకుండా ఇంటి చిట్కాలను పాటించవచ్చు. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ రోజు కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత వంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఈ డ్రింక్ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అవి ఆవాలు, సొంపు. ఈ రెండు కూడా మనం దాదాపుగా ప్రతి రోజు వాడుతూ ఉంటాం. ఈ చిట్కా కోసం ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ సొంపు వేసి ఒక నిమిషం మరిగించాలి. ఆ తర్వాత అరస్పూన్ ఆవాలు వేసి 3 నిమిషాల పాటు మరిగించాలి.

మరిగిన సొంపు,అవాల నీటిని వడకట్టి ప్రతి రోజు ఉదయం తాగాలి. డయబెటిస్ లేనివారు కొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఉదయం సమయంలో తాగటం కుదరని వారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగవచ్చు. అయితే ఈ డ్రింక్ తాగటానికి అరగంట ముందు కడుపు ఖాళీగా ఉంచాలి.

ఈ డ్రింక్ కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత తగ్గించటమే కాకుండా అధిక బరువు, కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలను తగ్గించటానికి కూడా బాగా సహాయపడుతుంది. ఈ డ్రింక్ 15 రోజులు తాగిన తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల 15 రోజులు తాగాలి. మీ సమస్యను బట్టి మరల నెల రోజుల పాటు ఈ విధంగా తాగాలి. ఈ డ్రింక్ రోజుకి ఒక గ్లాస్ తాగాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."