రెమ్యునరేషన్ లో ట్రెండ్ మార్చిన స్టార్ హీరోలు…ఎలానో తెలుసా?

Tollywood Heroes New Plan For Movies :గతంలో ఎన్టీఆర్, అక్కినేని హయాంలో నెలకు జీతాల కింద ఇచ్చి సినిమాలు తీసేవారు నిర్మాతలు. తర్వాత నుంచి రెమ్యూనరేషన్ తీరు మారుతూ వచ్చింది. ఇచ్చిన రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా అందుకోవడం వంటి పరిణామాలు వచ్చాయి. అయితే తాజాగా వీలైనంత తక్కువ డేట్స్ ఇచ్చి, ఆ సమయంలోనే సినిమా పూర్తయ్యేలా చూసుకుంటున్నారు స్టార్ హీరోలు.

ఇందుకోసం స్టార్ హీరోలు ట్రెండ్ మార్చేశారని టాక్. ఖైదీ నెంబర్ 150తో సినీమా రంగంలోకి వచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. ఒక్కో సినిమాకు 60 రోజుల సమయం ఇచ్చి, 60కోట్లు అందుకుంటున్నట్లు టాక్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 50రోజుల డేట్స్ ఇచ్చి 50కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా మూవీస్ కనుక ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ మూవీకి 60రోజుల సమయం ఇచ్చి పూర్తిచేసాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించే మూవీకి 60రోజుల సమయం ఇచ్చాడట. సమయం దాటితే రేటు కూడా మారుతుందన్న కండీషన్ పెట్టినట్లు టాక్.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో సినిమాకు 60నుంచి 80కోట్ల దాకా అందుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం సర్కారు వారి పాట పూర్తిచేసి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ ఎస్ రాజమౌళి మూవీస్ కి రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్ కూడా 35కోట్లు వరకూ ఒక్కో సినిమాకు అందుకుంటున్నాడు. ఆచార్య, ఆర్ ఆర్ ఆర్ మూవీస్ పూర్తిచేసి, తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో చేయడానికి రెడీ అయ్యాడు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ పూర్తిచేసి, కొరటాల శివ డైరెక్షన్ లో చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే త్వరగా ఈ సినిమా పూర్తిచేయాలన్న కండీషన్ పెట్టారట. అల్లు అర్జున్ కూడా ఇదే కండీషన్ ఫాలో అవుతున్నాడట. ఇక నేచురల్ స్టార్ నాని తన మూవీకి మూడు నెలల టైమ్ ఇచ్చాడట. ఇక రవితేజ 30రోజుల డేట్స్ ఇచ్చి 18కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్.