సీనియర్ హీరోలతో నటించాలంటే.. శృతిహాసన్ కండిషన్స్ ఇవే…?

Tollywood Heroine Shruti Haasan : కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తెలుగులో గతంలో చేసిన కొన్ని ఫోటోషూట్ పిక్స్ తాాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఓ వైపు ప్రభాస్ వంటి యువ హీరోల సరసన చేస్తూ మరో వైపు బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ తో జోడీకి అంగీకరించడం విశేషం. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో మెరిసిన ఆమె తెలుగులో నటించిన చిత్రం ‘క్రాక్’ మంచి హిట్ అవ్వడంతో వరుసగా సినిమాలు చేస్తోంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. విలన్‌గా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మూవీకి సంబంధించి సింగరేణిలో శృతి, ప్రభాస్ లపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా పిక్చరైజ్ చేస్తారట.

కథతో పాటు సెంటిమెంట్ కూడా కలిసొచ్చేలా ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ షూట్ చేసిన ప్రాంతాల్లో ‘సలార్’ సినిమా ప్లాన్ చేశారని అంటున్నారు. ఇందులో డాన్ క్యారెక్టర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో ప్రభాస్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఖిలాడి ఫేమ్ మీనాక్షి చౌదరి నటించబోతున్నట్టు, 2022 డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ‘సలార్’ అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ ను 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందట. తాజాగా క్రాక్ దర్శకుడు గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ తొలిసారి నటిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తోంది. ఇందుకు చాలా షరతులు పెట్టిందట. రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండకూడదనే కండిషన్ కూడా ఉందట. ముఖ్యంగా ఇదే దర్శకుడు తీసిన ‘బలుపు’,’క్రాక్’ భారీ హిట్లు కావడంతో శృతి హాసన్ ఈ సినిమాకి ఒకే చెప్పిందని టాక్. ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్‌ చేస్తోందట. ఇంకో హీరోయిన్ గా భావన నటిస్తున్నట్టు తెలుస్తోంది.