విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీ రివ్యూ…ఎలా ఉందంటే…మరో హిట్…?

Drushyam 2 Movie Review in Telugu : వెంకటేష్,మీనా హీరో,హీరోయిన్ లుగా తెరకెక్కిన‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా తాజాగా‘దృశ్యం 2’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదల అయింది. ఇక మలయాలంలో ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ రెండో భాగాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమా దృశ్యం సినిమాకి కొనసాగింపుగా ప్రారంభం అవుతుంది. సినిమా మొదట్లో కాస్త బోర్ కొట్టిన 40 నిమిషాల తర్వాత కథలో వేగం పెరుగుతోంది. రెండో భాగంలో వెంకటేష్ ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడు. ఆ తర్వాత వెంకటేష్ తన ఫ్యామిలీని కాపాడనే ఎమోషనల్‌తో ‘దృశ్యం 2’ ఎంతో ఎమోషనల్‌గా సాగింది.

క్లైమాక్స్ సన్నివేశాలు చాలా ట్విస్ట్ లతో సాగి సినిమా బాగానే ఆకట్టుకుంది. ఇక సినిమాకి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, నటీనటుల నటన, స్క్రీన్ ప్లే, కెమెరా పనితనం అని చెప్పవచ్చు. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది. ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలంటే కంప్లీట్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.