Healthhealth tips in telugu

ఈ ఒక్క మొక్కను ఇంటిలో పెంచుకుంటే చాలు ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Multi Vitamin Plant benefits in telugu : ఈ మొక్క పేరు మల్టీ విటమిన్ మొక్క. దీని ఆకులు కరివేపాకు ఆకులను పోలి ఉంటాయి. ఈ మొక్కని మల్టీ విటమిన్, చక్రముని, కట్టుక్, స్వీట్ లీఫ్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కకు ఎర్రని కాయలు కాస్తాయి. ఈ మొక్కలో ఎన్నో ఔషద ప్రయోజనాలు ఉన్నాయి.

మల్టీ విటమిన్ మొక్క ఆకులలో విటమిన్ ఎ, బి, సి, ఫ్లేవనాయిడ్స్, కేరోటనాయిడ్స్, సఫోనాయిడ్స్, ప్రోటీన్స్ మినరల్స్, ఆల్కలాయిడ్స్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ మొక్కలో ఎక్కువ ఔషద గుణాలు ఉండటం వలన ఈ మొక్కను మల్టీ విటమిన్ మొక్క అని అంటారు. ఈ ఆకులతో పప్పు, కూర, కారం పొడి, పచ్చడి, రసం వంటి వాటిని తయారుచేసుకొని తినవచ్చు.
Multi Vitamin Plant
ఈ ఆకులలో ఉండే అనేక రకాల ఫ్లేవనాయిడ్స్ ఒత్తిడిని,డిప్రెషన్ ని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచి మెదడుకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.

ప్రసవం తర్వాత తల్లి పాల ఉత్పత్తిని పెంచే సామర్ధ్యం కలిగి ఉంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రో బయల్ లక్షణాలు సమృద్దిగా ఉండటం వలన గాయాలను నయం చేయటంలో బాగా పనిచేస్తుంది. ఈ ఆకులలో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉండటం వలన పోషకాహార లోపం లేకుండా చేస్తుంది.

ఈ ఆకులలో సోడియం,పొటాషియం, ఫాస్ఫరస్,ఐరన్, మాంగనీస్, రాగి, జింక్, మెగ్నీషియం, కోబాల్ట్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. ఈ ఆకులో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికి పచ్చిగా తీసుకోకూడదు. ఉడికించి మాత్రమే తీసుకోవాలి. అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది.