స్నానం చేసే నీటిలో వేపాకులు వేస్తే ఏమి జరుగుతుందో తెలుసా ?
Neem Leaves benefits in Telugu : వేప చెట్లు మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వేపాకులలో ఎన్నో ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వేప ఆకులను మన పూర్వీకుల కాలం నుండి ఉపయోగిస్తున్నారు.వేప ఆకులలో ఫ్యాటీ యాసిడ్లు, లిమోనోయిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.
ముఖ్యంగా వేప ఆకులు చర్మ సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి. గోరువెచ్చని నీటిలో వేప ఆకులను వేసి స్నానం చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పొడి చర్మం ఉన్నవారిలో చర్మానికి అవసరం అయినా తేమ అందుతుంది.
చర్మంపై ఉండే సహజసిద్ధమైన నూనెలు అలానే ఉండేలా చేసి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. చర్మంపై ఎటువంటి ఇన్ ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. వేప ఆకులను పేస్ట్ గా చేసి శరీరానికి, ముఖానికి పట్టించి పావు గంట అయ్యాక స్నానం చేస్తే ఎటువంటి చర్మ సమస్యలు ఉండవు.
ఇలా వారానికి ఒకసారి చేస్తే అన్ని రకాల చర్మ సమస్యలు పోయి చర్మం మృదువుగా మారుతుంది. పొడిదనం తగ్గుతుంది. చర్మంపై ఉండే ముడతలు కూడా పోయి యవ్వనంగా కనిపిస్తారు. వేప ఆకులు దొరకని వారికి మార్కెట్ లో వేప పొడి దొరుకుతుంది. అలాగే వేప నూనె కూడా ఉంటుంది. తాజా వేప ఆకులు దొరికితే వాటినే ఉపయోగించండి.