ఈ కాయలలో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు… ఇది నిజం
Roselle Fruit Benefits In telugu : పుల్లని రుచితో ఉండే గోంగూర అంటే మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోంగూరతో పచ్చడి,పప్పు చేసుకుంటారు. గోంగూరలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే గోంగూర కాయలలో కూడా చాలా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు.
ప్రతి రోజు 2 గోంగూర కాయలను తింటే చాలా మంచిది.ఈ కాయలు పైన ఎర్రని రేకలను కలిగి లోపల గింజ ఉంటుంది. ఎర్రని రేకలతో పప్పు, పచ్చడి వంటివి చేసుకుంటారు. గోంగూర కాయలు కూడా పుల్లని రుచిని కలిగి ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగు తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.
డయబెటిస్ ఉన్నవారికి ఒక వరం అని చెప్పవచ్చు. గ్లాస్ నీటిలో 2 లేదా 3 గోంగూర కాయల రేకలను వేసి 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి ఉదయం పరగడుపున తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. అంతేకాకుండా శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.
మెదడు పనితీరు మెరుగుపడి వయస్సు పెరిగే కొద్ది వచ్చే జ్ఞాపక శక్తి సమస్యలు తగ్గి జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది. కంటి చూపు పెరుగుతుంది. చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది. కిడ్నీలు శుభ్రం అవ్వటమే కాకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్ర సంబంధిత సమస్యలు నయం అవుతాయి.