Healthhealth tips in telugu

ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తింటే …రక్తహీనత ,డయాబెటిస్, అధిక బరువు,అలసట శాశ్వతంగా మాయం

Red Wheat Rava Benefits In Telugu : ఈ రోజు మనం సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓపిక అనేది ఉండటం లేదు. అలాగే కొంచెం పని చెసేటప్పటికే అలసట వచ్చేస్తుంది. అందువల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గోధుమ రవ్వను తీసుకుంటే
మంచిది.
goduma nuka
గోధుమరవ్వతో ఉప్మా చేసుకోవచ్చు. ఉప్మాలో అన్ని రకాల కూరగాయలను వేసుకోవచ్చు. లేదా రవ్వను ఉడికించి పాలు కలిపి తినవచ్చు. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. ఉదయం తింటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అలాగే శక్తి కూడా ఎక్కువగా వస్తుంది. ఈ గోధుమ రవ్వను రెగ్యులర్ గా తీసుకుంటే అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి.

దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి చాలా హెల్ప్ చేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. గోధుమ రవ్వలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉన్నాయి మరియు గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ ని స్థిరంగా విడుదల అయ్యేలా చేస్తుంది.

ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన అలసట మరియు రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. దాంతో
అలసట,బలహీనత తగ్గి ఉషారుగా ఉంటారు.బరువు తగ్గాలని అనుకునేవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. ఫైబర్ ఎక్కువ కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగులను శుభ్రపరుస్తుంది మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది.