Movies

మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు

Major Chandrakanth Full Movie :కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్ లోనే దేశభక్తిని రగిలిస్తూ, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తో నటిస్తూ తీసిన మేజర్ చంద్రకాంత్ సినిమా కాసుల వర్షం కురిపించింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ నటించిన చివరి కమర్షియల్ మూవీ. ఎన్టీఆర్ దాదాపు 300పైగా సినిమాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీశారు. సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చాక చేసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. అయితే చిరస్థాయిగా నిలిచేవిధంగా ఓ కథ రాయాలని మోహన్ బాబు అడిగిందే తడవుగా ,పవర్ ఫుల్ పాత్రతో కూడిన ఈ సినిమా తయారు చేసారు. వయస్సు రీత్యా అలాంటి పాత్ర ఎన్టీఆర్ చేయగలరా అని అనుకుంటే అందరినీ ఆశ్చర్యపరుస్తూ అద్భుతంగా నటించారు.

కీరవాణి సంగీతంలో వచ్చిన ఈ మూవీలో పుణ్యభూమి నాదేశం సాంగ్ అన్నిచోట్లా మారుమోగింది. ఎన్టీఆర్ ని మళ్ళీ సీఎం పీఠం పై కూర్చోబెట్టడంలో ఈ సినిమా కీలక భూమిక వహించిందని చెప్పాలి. ఎన్టీఆర్ తో కల్సి నటించాలని అనడంతో సామ్రాట్ అశోక మూవీలో ఓ పాత్ర ఇచ్చారు. అయితే బసవతారకం పేరుతొ ట్రస్ట్ బిల్డింగ్ కట్టడానికి బయట మూవీ చేయాలని భావిస్తున్నట్టు ఎన్టీఆర్ మీడియాలో ప్రకటించడంతో ఆ సినిమా నాకే చేయండి అని మోహన్ బాబు అడగడం, ఎన్టీఆర్ ఒకే చెప్పడం, వెంటనే రాఘవేంద్రరావు చెవిన వేసి, పరుచూరి సోదరులను కథకు పురమాయించడం చకచకా జరిగాయి. కథ రెడీ అవ్వడంతో ఎన్టీఆర్ కి వినిపించడం, ఒకే చేయడంతో మేజర్ చంద్రకాంత్ ప్రకటన అయింది. దీంతో ఇండస్ట్రీలో అందరూ షాకయ్యారు. శారద, నగ్మా, రమ్యకృష్ణ ,అమ్రిష్ పురి, వంటి నటీనటులు,గౌతమ్ రాజు,అజయ్ విన్సెన్ట్, భాస్కరరాజు, కీరవాణి లాంటి సాంకేతిక నిపుణులను కూర్చుకుని రామకృష్ణ సినీ స్టూడియోలో 1992 నవంబర్ 20న వైభవంగా షూటింగ్ స్టార్ట్.

చంద్రబాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మంచు లక్ష్మి ప్రసన్న క్లాప్ కొట్టారు. రాజమండ్రి, అరకులోయ, ఢిల్లీ, కులుమనాలి, కాశ్మీర్, తలకోన తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసారు. చండీఘర్ లో ఆర్మీ జవాన్ల మధ్య కూడా షూటింగ్ చేసారు. చివరి రోజు షూటింగ్ పూర్తయ్యాక ఎన్టీఆర్ వెళుతుంటే అక్కడున్న యూనిట్ సభ్యులంతా ఏడ్చేశారు. 1993ఏప్రియల్ 23న సినిమా రిలీజయింది. దేశభక్తి గల చంద్రకాంత్ గా ఎన్టీఆర్, స్మగ్లింగ్ తో సంబంధాలు గల దొంగగా ఆయన కొడుకుగా మోహన్ బాబు .. ఇక ఎంపీ జ్ఞానేశ్వరరావు గా వేసిన అమ్రిష్ తో మేజర్ చంద్రకాంత్ తలపడడం, కొడుకు తెల్లకాగితంలా మారిరావాలని తండ్రి ఆదేశం ..

ఇలా సినిమా అంతా భావోద్వేగంతో సాగిపోతుంది. మేజర్ చంద్రకాంత్ వీరమరణం పొందడంతో సినిమా ముగియడం బాగానే కనెక్ట్ అయింది. పుణ్యభూమి నాదేశం సాంగ్ లో అల్లూరి, సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, వీర పాండ్య కట్ట బ్రహ్మన, గెటప్స్ లో ఎన్టీఆర్ కంపించడంతో ఆడియన్స్ కి సంబరమే అయింది. ఈ సినిమా సాంగ్స్ అన్నీ అప్పట్లో టేప్ రికార్డుల్లో మారుమోగేవి. దర్శకేంద్రుడికి ఎన్టీఆర్ తో ఇది 12వ సినిమా కాగా, మోహన్ బాబు 12 సినిమా కూడా ఇదే. తిరుపతిలో 100డేస్ వేడుక ఓ హిస్టరీ గా మిగిలింది.