Healthhealth tips in telugu

వీటిని పాలతో కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా… అసలు నమ్మలేని నిజాలు

Milk Side Effects In telugu : పాలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ప్రతి రోజు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే పాలతో కలిపి కొన్ని పదార్ధాలను అసలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.

పుల్లని రుచితో ఉండే పండ్లను పాలతో కలిపి తీసుకోకూడదు. పులుపు కారణంగా పాలు విషపూరితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే అరటిపండుతో కలిపి పాలను తీసుకుంటే కఫం పెరిగి జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ముల్లంగి తిన్న రెండు గంటలు తర్వాత మాత్రమే పాలను తాగాలి.

పాలతో పాటు పప్పు దినుసులను అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా మినపప్పు.. అందులోనూ ఉప్పు లేదా ఆమ్లా పదార్ధాలు దానిలో కలిపినట్లయితే.. దాన్ని తీసుకున్న వెంటనే పాలు అసలు తాగకూడదు. అలాగే చాలా మంది మొలకెత్తిన గింజలు తిన్న తర్వాత పాలను తాగుతూ ఉంటారు. అలా చేయకూడదు. పాలతో పాటు మినపప్పును తింటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్పుతున్నారు.

మనం చేసే ప్రతి వంటకంలోనూ ఉప్పు వాడుతూ ఉంటాం. ఇక చెప్పాలంటే ఉప్పు లేకుండా ఏ వంటకం ఉండదు. అయితే ఉప్పు, పాలను అస్సలు కలపకూడదు. బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత గానీ.. రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైధ్యులు అంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. ఈ విధంగా చేస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట.