Healthhealth tips in telugu

పీరియడ్స్ సమయంలో కడుపునొప్పిని నిమిషంలో తగ్గించే అద్భుతమైన ఆకు

Munagaku Benefits In Telugu : పీరియడ్స్ సమయంలో చాలా మందికి కడుపునొప్పి వస్తూ ఉంటుంది. అసలు ఇలా రావటానికి కారణం ఏమిటో తెలుసుకొని పరిష్కారం గురించి కూడా తెలుసుకుందాం. హర్మన్స్ అసమతుల్యత ,వంశ పారంపర్యం వలన కూడా కడుపునొప్పి రావచ్చు. హార్మోన్స్ అసమతుల్యత మన ఆలోచనల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
Drumstick leaves benefits in telugu
ఈ విషయాలు తెలియక మనలో చాలా మంది కడుపునొప్పి రాగానే మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాం. ఆలా టాబ్లెట్స్ జోలికి వెళ్లకుండా ఒక అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ఉంది. ఈ చిట్కా కోసం మనకు కావలసిన ఇంగ్రిడియన్స్ అన్ని మనకు అందుబాటులో ఉంటాయి. అవి మునగాకు మరియు మిరియాలు.

ఈ రెమిడీ కోసం మునగాకును పొడిగా వాడవచ్చు లేదా ఆకు రూపంలోగాని వాడవచ్చు. ఒక గ్లాస్ నీటిలో పావు స్పూన్ మునగాకు పొడి,మూడు మిరియాలు వేసి అరగ్లాసు నీరు అయ్యేవరకు మరిగించాలి. ఆ నీటిని వడకట్టి త్రాగాలి. ఈ విధంగా పీరియడ్స్ సమయంలో ఉదయం, సాయంత్రం, రాత్రి మూడు పూటలా ఈ కషాయాన్ని త్రాగాలి.

ఈ విధంగా తాగితే కడుపునొప్పి తగ్గుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మునగాకు మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది. అలాగే మిరియాలను రెగ్యులర్ గా మనం వంటగదిలో వాడుతూనే ఉంటాం. కాబట్టి కాస్త శ్రద్ద, సమయాన్ని పెడితే మంచి ఫలితం వస్తుంది.