బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్…గుర్తు పట్టారా…?

Tollywood heroine anupama parameswaran : సోషల్ మీడియాలో పలువురు నటీనటుల ఫోటోలు, వీడియోలు వస్తున్నాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు ఈ మధ్య ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ చిన్నప్పటి ఫోటో వైరల్ గా మారింది. దాంతో సో క్యూట్ అంటూ జనాలు కామెంట్స్ పెడుతున్నారు. ఈ భామ ప్రస్తుతం రౌడీ బాయ్స్, 18 పేజీస్, కార్తికేయ 2, హెలెన్ చిత్రాల్లో చేస్తోంది.

ప్రేమమ్ సినిమాతో మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఆతర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన అఆ మూవీతో టాలీవుడ్ కి నేరుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనుపమ ప్రేమమ్’ తెలుగు రీమేక్ లో నాగచైతన్యతో కల్సి నటించింది. తొలి మూవీతోనే యువ హృదయాలను కొల్లగొట్టిన అనుపమ గ్లామర్ పాత్రలు కాకుండా ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకుంటూ ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

యువ హీరోల సరసన నటించి వరుస హిట్స్ అందుకుంది. అన్ని దక్షిణాది భాషల్లోనూ ఈమె క్రేజ్ నడుస్తోంది. శర్వానంద్ తో కల్సి శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, నేచురల్ స్టార్ నానితో కల్సి కృష్ణార్జున యుద్ధం, అలాగే హలో గురు ప్రేమ కోసమే, బెల్లంకొండ సురేష్ తో కల్సి రాక్షసుడు వంటి సూపర్ హిట్స్‌ మూవీస్ చేసింది.