2 సార్లు – మూత్రంలో మంట, నొప్పి, యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా శరీరంలో వేడి ఉండదు

Urine infection Home Remedies in Telugu : ప్రస్తుత కాలంలో అనేక మంది మూత్రంలో మంట, ఇన్ ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి లవణాల గాఢత పెరిగి కిడ్నిల్లో రాళ్లు మరియు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌ (యు.టి.ఐ) ఏర్పడే అవకాశం ఉండటమే.యూటిఐ (యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ )అత్యంత సాధారణ సమస్య.
dhaniyalu
దీని కారణంగా పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, ఎక్కువసార్లు ముత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా త్వరగా తగ్గుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది,

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ పటికబెల్లం, పావు స్పూన్ ఉప్పు వేసి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటే మూడు రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది.

ఈ నీటిని తాగటం వలన యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా కిడ్నీలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు కూడా కరుగుతాయి. ధనియాలు,పటికబెల్లం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ధనియాలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. అలాగే మంచి నీటిని ఎక్కువగా తాగాలి. ఆకుకూరలు,పండ్లను తప్పనిసరిగా తినాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.