2021 లో అభిమానులను మెప్పించిన హీరోలు వీరే
2021 Best Movies : బ్లాక్ బస్టర్ అందుకున్న వాళ్లతో పాటు సరైన హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్న హీరోలకు సైతం 2021మంచి ఊపు నిచ్చింది. అందులో ప్రధానంగా నందమూరి బాలకృష్ణ ను ప్రస్తావించాలి. 2019ఎన్నికల ముందు వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, నాయకుడు మూవీస్ పరాజయం తర్వాత హిట్ కోసం కసిగా చేసిన మూవీ అఖండ.
ఈ సినిమా ఇటు బాలయ్యతో పాటు అటు డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి కూడా మళ్ళీ లైఫ్ ఇచ్చింది. డబుల్ యాక్షన్ తో మురళీకృష్ణ, అఘోర పాత్రల్లో బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. వరల్డ్ వైడ్ గా బాలయ్య అభిమానులకు పండగ ముందే తెచ్చేసిందని విశ్లేషకుల అంచనా. రవితేజ నటించిన క్రాక్ మూవీ మాస్ మహారాజ్ కు కొత్త ఊపు ఇచ్చింది. సరైన హిట్ కోసం చూస్తున్న సమయంలో మంచి కిక్కు ఇచ్చింది.
అలవైకుంఠపురంలో మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, కలెక్షన్స్ వర్షం రాబట్టింది. ఊర మాస్క్యారెక్టర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ లీడర్ గా బన్నీ తన నటనతో ఫాన్స్ లో జోష్ నింపాడు. మ్యాస్ట్రో మూవీతో నితిన్ సత్తా చాటాడు. ఎందుకంటే బాలీవుడ్ లో హిట్ అయిన ఆంధాదున్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో నితిన్ నటనతో ఆకట్టుకున్నాడు.
రిపబ్లిక్ మూవీతో సాయిధరమ్ తేజ్ తన నటనలో నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తమిళ మూవీకి రీమేక్ గా వచ్చిన నారప్పలొ విక్టరీ వెంకటేష్ తనదైన నటన ప్రదర్శించి డిఫరెంట్ పాత్రలో ఒదిగిపోయాడు. ఎంతో శ్రమపడి రానా చేసిన అరణ్య మూవీలో అతడి నటనకు జనం జేజేలు పలికారు. పైగా ఈ సినిమాతో ఆరోగ్యం కూడా పాడై కోలుకున్నాడు.
టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే ఉప్పెన లా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్. ఇక ఈ మూవీ తర్వాత కొండపొలం మూవీలో తన నటనతో అలరించాడు. నేచురల్ స్టార్ నాని డిఫరెంట్ రోల్స్ తో డబుల్ యాక్షన్ లో చేసిన శ్యామ్ సింగరాయ మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విభిన్న పాత్రలతో నాని చేసిన నటన ఆకట్టుకుంటుంది.
జాతి రత్నాలు మూవీలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటనతో కామెడీ అదరగొట్టారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. అల్లరి నరేష్ పడిన కష్టానికి ప్రతిఫలంగా ‘నాంది’ మూవీ మళ్ళీ హీరోగా నిలబెట్టింది. బ్రోచేవారెవరురా మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు తాజాగా కామెడీ టచ్ ఉన్న రాజరాజ చోర మూవీతో ఆకట్టుకున్నాడు.