MoviesTollywood news in telugu

2021 లో ప్రేక్షకులను ఆశ్చర్యపరచిన సినిమాలు ఇవే…మీరు చూసారా…?

2021 Surprising Movies : కొన్ని సినిమాలు అంచనాలు లేకుండా వస్తాయి. కానీ ఊహించని విజయాన్ని అందుకుంటాయి. అలా చూస్తే, క్యారెక్టర్ యాక్టర్ నుంచి హీరోగా ఎదిగిన సత్యదేవ్ తిమ్మరుసు మూవీలో మంచి నటన ప్రదర్శించాడు. కన్నడ రీమేక్ గా వచ్చిన సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే స్కైలాబ్ మూవీలో కూడా సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. నిత్యా మీనాను, రాహుల్ రామకృష్ణ ల నటన కూడా ఒకే.

పుష్పక విమానం మూవీలో మంచి నటనా సన్నివేశాలు ఉన్నాయి. అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉండే జంట పడే ఇబ్బందిని చక్కగా తెరకెక్కించారు.అయితే ప్రమోషన్ వర్క్ వీక్ గా ఉండడం వలన అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ని రీచ్ కాలేదు. లవ్ లైఫ్ పకోడీ మూవీ విభిన్నంగా ఉంటుంది. చెల్లెలి వరుస అమ్మాయిని ప్రేమించి, తీరా తెల్సిన తర్వాత కూడా సిన్సియర్ గా ప్రేమిస్తూ కంటిన్యూ అయిపోతాడు హీరో. వివాదాస్పదమైన ఈ అంశాన్ని డైరెక్టర్ బాగా డీల్ చేసాడు.

ఉప్పెన తర్వాత వైష్ణవ తేజ్ నటించిన కొండపోలం మూవీని క్రిష్ తెరకెక్కించాడు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఈ మూవీ బాగానే ఆకట్టుకుంది. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ సమాజంలో జరిగే తప్పులను ఎత్తిచూపింది. ఆడియన్స్ ఆకట్టుకున్నప్పటీకి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కళాత్మకంగా తీసిన ఆకాశవాణి మూవీ లవర్స్ ని అలరిస్తుంది. రేడియో అంశం సినిమాకు హైలెట్.

ఆటో నడిపే యువకుడికి కెమెరా దొరికితే దాంతో సినిమా ఎలా తీసాడనే అంశంతో సినిమా బండి మూవీ వచ్చి కొత్త నటులను తెరముందుకు తెచ్చింది. హీరోగా వచ్చిన ఏ 1ఎక్స్ ప్రెస్ మూవీలో హాకీ ప్లేయర్ గా సందీప్ కిషన్ నటన ఆకట్టుకుంటుంది. తమిళ రీమేక్ ఛాయలు కన్పించకుండా తెరకెక్కించారు. ఇక తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన జాంబిరెడ్డి మూవీ రిలీజ్ కి ముందు కంటే రిలీజయ్యాక జనాల్లోకి దూసుకెళ్లింది.

సాంగ్స్ హైలెట్ తో ఓటిటి రిలీజ్ తో పాటు థియేటర్ల వైపు నడిపించిన ఎస్ ఆర్ కల్యాణ మండపం మూవీ సింపుల్ లవ్ స్టోరీతో తెరెక్కింది. లాజిక్ గా తీసిన పచ్చీస్ సినిమా అమెజాన్ లో వచ్చి ఆకట్టుకుంది. జి 5లో వచ్చిన బట్టల రామస్వామి బయోపిక్ మూవీ కామెడీ ప్రధానంగా తెరకెక్కింది. అంతా కొత్త నటులు కావడం, డైరెక్టర్ స్వయంగా మ్యూజిక్ అందించడం విశేషం. అంజలి పాపను తలపించే రీతిలో నిత్యామీనన్ నటించిన నిన్నిలా నిన్నిలా మూవీ ఓటిటిలో వచ్చి ఆకట్టుకుంది. నోరూరించే వంటకాలతో ఈ మూవీని ఎక్కడ బోర్ కొట్టకుండా నడిపించారు