MoviesTollywood news in telugu

2021 లో అభిమానులను నిరాశ పరచిన సినిమాలు ఇవే

most disappointed movies of 2021 : కొన్ని సినిమాలపై భారీ అంచనాలు సహజం. అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన మూవీస్ తో పాటు మరికొన్ని సినిమాలు కూడా 2021లో వచ్చి నిరాశ మిగిల్చాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత భారీ అంచనాల నడుమ వచ్చిన రామ్ నటించిన రెడ్ మూవీ డిజాస్టర్ అయింది. మణిశర్మ ఆకట్టుకునే సాంగ్స్, హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ వంటివి ఉన్నా సినిమాను గట్టెక్కించలేకపోయాయి.

ఇక ట్రెయిలర్ తోనే ట్రోలింగ్ బారిన పడ్డ అల్లుడు అదుర్స్ దారుణ పరాజయం పాలైంది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఈ మూవీలో నభా నటేష్, సోనూ సూద్ వంటి వాళ్లు నటించారు. దగ్గుబాటి రానా కష్టపడి నటించిన అరణ్య సినిమా కూడా కథ, కధనం ఆకట్టుకోకపోవడంతో అరణ్య రోదనే అయింది. ఒకే ఒక లోకం సాంగ్ తో పాపులర్ గా నిల్చిన శశి మూవీ కూడా డిజాస్టర్ గానే మిగిలింది.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ద్వారా హీరోగాఎంట్రీ ఇచ్చిన బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు కు ఈ సినిమా నిరాశ మిగిల్చింది. నిజానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ లో నీలి నీలి ఆకాశం సాంగ్ సినిమా రిలీజ్ కి ముందు పాపులర్ అయినా, కథ కధనం ఆకట్టుకోలేక పరాజయం పాలైంది. విశ్వక్ సేన్ హీరోగా చేసిన పాగల్ మూవీ లో కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకున్నా మూవీ డిజాస్టర్ అయింది.

అక్కినేని మేనల్లుడు సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ కూడా ఆడియన్స్ ని అలరించలేకపోయింది. కన్నడ బ్లాక్ బస్టర్ దియా మూవీకి రీమేక్ గా వచ్చిన డియర్ మేఘ మూవీ కూడా ప్లాప్ అయింది. పైగా అదే సమయానికి కన్నడ మూవీ కూడా డబ్బింగ్ చేసి వదలడం మరింత దెబ్బతీసింది.

నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ మూవీ అమెజాన్ లో రిలీజై, ఆదరణకు నోచుకోలేదు. ఇక 2016లో షూటింగ్ ఆగిపోయిన ఆరడుగుల బులెట్ మూవీ 2021లో రిలీజై డిజాస్టర్ అయింది. గోపీచంద్ కి జోడీగా నయనతార నటించింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్ళిసందడి మూవీ కూడా కలెక్షన్స్ కొంతవరకూ రాబట్టినా, సినిమా పెద్దగా ఆడలేదు.

అలాగే అనిల్ రావిపూడి పర్యవేక్షణలో వచ్చిన గాలి సంపత్ మూవీ కూడా కథ, కథనం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. జగపతి బాబు నటించిన ఎఫ్ కె యుసి మూవీ థియేట్లలోకి వచ్చిన మర్నాడే యూట్యూబ్ లో వచ్చేసింది. సినిమా బాగుందా అంటే అదీ లేదు. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో వచ్చిన చెక్ మూవీ తీవ్ర నిరాశ పరిచింది.

అలాగే శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం మూవీ కూడా డిజాస్టర్ గానే మిగిలింది. రావు రమేష్ డిఫరెంట్ గా రైతు పాత్రలో అలరించాడు. కార్తికేయ, లావణ్య నటించిన చావుకబురు చల్లగా మూవీ నిరాశ పరిచింది. అలాగే మంచు విష్ణు నటించిన మోసగాళ్లు మూవీ డిజాస్టర్ అయింది. దాదాపు 50కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది.