Healthhealth tips in telugu

1 సారి-100% రోగనిరోధక శక్తిని పెంచి గ్యాస్,ఎసిడిటీ,కడుపు ఉబ్బరం,మంటనుతగ్గించి ఆకలి పెరిగేలా చేస్తుంది

Gas Home remedies in Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మారిన జీవన శైలి, అలవాట్లు కారణంగా ప్రతి ఒక్కరిలోనూ గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు తగ్గడానికి ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం.
jeelakarra Health Benefits in telugu
సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వచ్చు. అదే సమస్య పెద్దగా ఉంటే గనుక డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అర స్పూన్ జీలకర్ర వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగించాలి.

ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి తాగాలి. ఈ నీటిని తాగితే గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, కడుపులో మంట తగ్గటమే కాకుండా ఆకలి లేని వారిలో ఆకలిని పెంచుతుంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు రోజులో రెండు సార్లు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ నీటిని రోజు విడిచి రోజు తాగితే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. .

అంతేకాకుండా అధిక బరువు సమస్య తగ్గటానికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. అధిక బరువు., శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటానికి ఈ డ్రింక్ తాగాలి అనుకుంటే ఏ సమయంలోనైనా తాగవచ్చు. అదే గ్యాస్ సమస్యలు ఉన్నప్పుడు ఉదయం పరగడుపున తాగవచ్చు. లేదా సమస్య ఉన్నప్పుడు తాగవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.