Healthhealth tips in telugu

కంటి నరాలు బలంగా ఉండి కంటి చూపు బాగా పెరగటానికి వ్యాయామాలు

eyesight exercise : కంటికి ఎక్కువగా ఒత్తిడి ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కళ్ళతో చిన్న చిన్న అక్షరాలు, లైట్స్, స్క్రీన్స్ ఎక్కువగా చూసినప్పుడు కంటి నరాలు, రెటీనా ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతాయి. కంటికి ఒత్తిడి తగ్గి కంటి చూపు మెరుగు పడటానికి చేయవలసిన వ్యాయామాల గురించి తెలుసుకుందాం.
eye sight
ఒక చీకటి గదిలో కూర్చొని మూడు అడుగుల దూరంలో స్టూల్ మీద క్యాండిల్ వెలిగించి ఉంచాలి. క్యాండిల్ కళ్ళకి స్త్రైట్ గా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత కళ్లను కొంచెం తెరచి స్టూలు క్రింది భాగం నుండి చూస్తూ క్యాండిల్ ని చూడాలి. క్యాండిల్ జ్యోతి మధ్య బాగంలో దృష్టిని ఉంచాలి.

కొన్ని నిమిషాల పాటు కనురెప్పలు ఆర్పకుండా చూడాలి. ఇలా చూడటం వలన ఒత్తిడి ఎక్కువై కంటి నుండి నీరు కారుతుంది. కంటి నుండి నీరు కారే వరకు ఈ ప్రక్రియ చేయాలి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినప్పుడు జ్యోతి ఎలా వెలుగుతుందో అలాగే కళ్ళు మూసు కున్నప్పుడు అలా వెలుగుతున్నట్లు భావించి 4 నిమిషాల పాటు కళ్ళు తెరవకుండా ఉండాలి.

ఈ రెండు వ్యాయామాలను క్యాండిల్ కి బదులుగా ఉదయం సమయంలో వచ్చే సూర్య కిరణాలను చూస్తూ కూడా చేయవచ్చు. ఇలా చేయటం వలన కంటిలోని నరాలు రిలాక్స్ అయ్యి కంటి చూపు మెరుగుపడటమే కాకుండా కంటికి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వ్యాయామాన్ని అన్ని వయస్సుల వారు చేయవచ్చు.