Healthhealth tips in telugu

రోజుకి 2 స్పూన్స్ తింటే కీళ్ల నొప్పులు,రక్తహీనత,అలసట,నీరసం,నిసత్తువ వంటివి ఉండవు

Atukulu Benefits : అటుకులు గురించి మనలో చాలా మందికి తెలుసు. మనలో చాలా మంది అటుకులతో ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటారు. అటుకులతో స్వీట్స్ చేసుకోవచ్చు. అలాగే హాట్స్ కూడా చేసుకుంటారు. అటుకులతో ఏమేమి చేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి తింటే అస్సలు వదలరు. అటుకులలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
రక్తహీనత సమస్య ఉన్నవారికి అటుకులు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే అటుకుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.అటుకులలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అటుకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కె, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి.

కాస్త అలసటగా ఉన్నప్పుడు వేడి పాలలో అటుకులను నానబెట్టి తింటే తక్షణ శక్తి వస్తుంది.డయాబెటిస్ తో బాధపడేవారు అటుకులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే అటుకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో భయంకరమైన వైరస్ ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

అటుకుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉండుట వలన కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి రాకుండా కీళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.