Healthhealth tips in telugu

ర‌క్త‌నాళాల్లో ఉండే బ్ల‌డ్‌ క్లాట్స్ కరగాలంటే….వీటిని తీసుకోండి

Blood Clots Home Remedies : ఈ మధ్య కాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువయ్యాయి. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, డయాబెటిస్, సరైన నిద్ర లేకపోవడం, ఎక్కువగా పని చేయడం, ఒత్తిడి వంటి కారణాలతో గుండెకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అలాగే అధిక రక్తపోటు కారణంగా కూడా హార్ట్ ఎటాక్ సంభవిస్తుంది.

అలాగే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ సూచనలతో పాటు కొన్ని ఆహారాలు తీసుకుంటే రక్తనాళాల్లో క్లాట్స్ తొందరగా కరిగిపోతాయి. వారంలో రెండు సార్లు కివి పండ్లు, పైనాపిల్, పాలకూర వంటి ఆహారాలు తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఒక స్పూన్ అల్లం రసం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో వాపు,రక్తనాళాల్లో అడ్డంకులు అన్ని తొలగిపోతాయి. రాత్రి పడుకోవడానికి ముందు అంటే అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగాలి.
ద్రాక్ష రసం కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక కప్పు ద్రాక్ష పండ్లను తినటం లేదా ఒక గ్లాసు ద్రాక్ష రసం తాగితే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో ఉండే క్లాట్స్ ని కరిగించి గుండె సమస్యలు లేకుండా చేస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే సరిపోతుంది. అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చిగా తినకూడదు. తేనెతో కలిపి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తగ్గి రక్తసరఫరా బాగా జరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.