నరాల బలహీనత, నరాల నొప్పులు, వాపులు, రక్తం గడ్డ కట్టడం, కళ్ళు తిరగడం అనేవి జీవితంలో ఉండవు
Nerve weakness : ఈ రోజుల్లో అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. శరీరంలో నరాల శక్తి సన్నగిల్లడం., నరాల బలహీనత, వాపులు, నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా రక్తపోటు., డయాబెటిస్ ఉన్న వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఈ సమస్యలు ఉన్నప్పుడు ప్రతిరోజు ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఉండాలి. మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇప్పుడు చెప్పు డ్రింక్ తాగితే నరాల బలహీనత తగ్గి నరాలకు బలాన్ని .అందిస్తుంది. పొయ్యిమీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క, ఒక నల్ల ఇలాచి చితకొట్టి వేయాలి. ఆ తర్వాత నాలుగు లవంగాలు వేయాలి.
ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి బెల్లం వేసి బాగా కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం వెయ్యకుండా తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం నెల రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనబడుతుంది. ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థ నిర్వహణకు సహాయపడుతుంది ఈ డ్రింక్ తాగుతూ మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే నరాల బలహీనత నుంచి బయట పడవచ్చు.
పాలకూర,ఆక్రోట్,చియా సీడ్స్,సబ్జా గింజలు,ఆకుకూరలు,చేపలు,డార్క్ చాక్లెట్ వంటి వాటిని ఆహారంలో బాగంగా చేసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకుంటూ అరగంట వ్యాయామం చేస్తూ ఈ డ్రింక్ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.