Healthhealth tips in telugu

1 స్పూన్ పొడి – వేగంగా బరువు తగ్గటమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Weight Loss Tips : ఈ రోజుల్లో మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రతి రోజు ఒక స్పూన్ పొడి తీసుకుంటే సరిపోతుంది. ఈ పొడిని ఒకసారి తయారుచేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పొయ్యి వేలిగించి బాణలి పెట్టి దానిలో ఒక కప్పు ఆవిసే గింజలు వేసి వేగించాలి.

ఆ తర్వాత అరకప్పు వేరుశనగ గింజలను వేసి వేగించాలి. ఆ తర్వాత 10 ఎండుమిరప కాయలను వేగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పచ్చి శనగపప్పు,ఒక స్పూన్ మినపప్పు, రెండు స్పూన్ల ధనియాలు, రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా వేగించాలి. వెగించిన వీటిని మిక్సీ జార్ లో వేయాలి.

ఆ తర్వాత కొంచెం చింతపండు,ఒక స్పూన్ జీలకర్ర,7 వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసి వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు అన్నంలో కలుపుకోవచ్చు. లేదా ఇడ్లీ, అట్లు వంటి వాటిలో నలుచుకోవచ్చు. ఈ పొడిని తీసుకోవటం వలన అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. డయబెటిస్ ఉన్నవారు కూడా ఈ పొడిని తీసుకుంటే నియంత్రణలో ఉంటుంది. ఆవిసే గింజలు, వేరుశనగలో ఉన్న పోషకాలు ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.