Healthhealth tips in telugu

జామకాయలు ఎలాంటి వాటిని తినాలి…తప్పనిసరిగా తెలుసుకోండి

Health Benefits of Eating Guavas : జామకాయలు ఎలాంటి వాటిని తినాలి… జామకాయ వలన కలిగే మేలు…. అన్నదానిపై చాలామందికి అవగాహన ఉండదు. మరీ పచ్చిగా ఉన్న జామకాయల్లో పాస్పారిక్, ఆక్సాలిక్ వంటి ఆమ్లాలు ఉంటాయి. వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. అదేవిధంగా ఎక్కువగా గింజలు ఉన్న జామపళ్లను తింటే అపెండిసైటిస్( 24 గంటల జబ్బు) వచ్చే ప్రమాదం ఉంది.
jamakaya
అందువల్ల దోరగా పండిన జామ పండును గానీ, లేదంటే గింజలు తక్కువ ఉన్న జామకాయను కానీ తినాలి. ఇక జామకాయల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. దంతాలు, చిగుళ్లనుంచి రక్తం కారేవారు జామకాయను కొరికి, బాగా నమిలి చప్పరించి ఆ పిప్పిని ఊసేయాలి. ఇలా చేయటం వల్ల రక్తం కారటం ఆగిపోవటమేకాదు దంతాలకు మేలు కలుగుతుంది.

గుండె బలహీనంగా ఉన్నవారు, క్షయవ్యాధితో బాధపడేవారు, బహిస్టు నొప్పులు అధికంగా ఉన్నవారు పండిన జామగుజ్జుతో తేనె, పాలు కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు సౌందర్యానికి జామ ఎంతో ఉపయోగపడుతుంది. జామ ఆకులను మెత్తగా నూరి ముఖంమీద వచ్చే మొటిమలకు రాసినట్లయితే అవి తగ్గిపోతాయి.

జామకాయలు ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల, జామకాయలను ఎక్కువగా తినడం వల్ల ప్రేగు కదలికలకు సహాయపడి మలబద్దకాన్ని నివారిస్తుంది. జామ ఆకు సారం కూడా మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.