Healthhealth tips in telugu

1 గ్లాసు తాగితే రక్తహీనత,కీళ్ల నొప్పులు,నిద్రలేమి,అలసట,నీరసం లేకుండా చురుకుగా ఉంటారు.

Makhana milk benefits : ఈ రోజుల్లో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రాకుండా అలాగే వచ్చిన సమస్యలను తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పే పాలను 15 రోజుల పాటు తాగితే సరిపోతుంది. పొయ్యి మీద పాన్ పెట్టి అరస్పూన్ నెయ్యి వేసి అరస్పూన్ గసగసాలను వేసి దోరగా వేగించాలి. ఆ తర్వాత ఒక గ్లాసు పాలను పోసి కొంచెం వేడి అయ్యాక 10 పూల్ మఖానాలను వేసి పది నిమిషాలు ఉడికించాలి.

ఈ పాలను గ్లాసులోకి పోసి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవాలి. మఖానాలో ఆల్కలాయిడ్ అనే మూలకం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఒత్తిడిగా ఉంటే మాత్రం రాత్రి సమయంలో తాగాలి. నిద్రలేమి సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగకరిగా ఉంటుంది.

మఖానాలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన అజీర్ణం,కడుపు ఉబ్బరం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. పాలు మరియు మఖానా రెండింటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది, ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనంగా లేకుండా బలంగా,ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

రక్తహీనత సమస్య, అలసట,నీరసం,నిసత్తువ వంటివి ఏమి లేకుండా చేస్తుంది. ఈ పాలను 15 రోజుల పాటు తాగితే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. మఖానాలో సోడియం, కేలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి. మఖానాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, కాల్షియం, మెగ్నీషియం మరియు ప్రోటీన్ ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.