1 గ్లాస్ – శరీరం డిహైడ్రేషన్ గురి కాకుండా వేడిని తగ్గించి అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా చేస్తుంది
Instant energy drink : వేసవి కాలం ఎండలు ప్రారంభం అయ్యాయి. ఎండ నుంచి రక్షణ పొందటానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. అలాగే శరీరంలో వేడి తగ్గి చల్లగా ఉండే మార్గాల వైపు అడుగు వేయాలి. దీని కోసం పుచ్చకాయ,కొబ్బరి నీరు,బార్లీ తో ఒక డ్రింక్ తయారుచేసుకుందాం.
ఈ మూడు కూడా వేసవిలో దాహం తీర్చటానికి,డిహైడ్రేషన్ కాకుండా ఉండటానికి,శరీరంలో వేడిని తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ డ్రింక్ తయారీకి మిక్సీ జార్ లో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను, ఒక కప్పు కొబ్బరి నీరును పోసి మిక్సీ చేయాలి. ఈ డ్రింక్ ని గ్లాసు లో పోసిన తర్వాత అరగంట నీటిలో నానబెట్టిన ఒక స్పూన్ బార్లీ గింజలను,ఒక స్పూన్ తేనె కలపాలి.
ఈ డ్రింక్ ని తాగటం వలన శరీరంను డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే తక్షణ శక్తి లభించి నీరసం,అలసట,నిస్సత్తువ వంటివి ఉండవు. శరీరంలో వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. పుచ్చకాయ, కొబ్బరి నీళ్లలో ఎక్కువ శాతం నీరు, తక్కువ కేలరీలు ఉంటాయి. శరీరంలో కోల్పోయిన లవణాలను భర్తీ చేస్తుంది.
బయట దొరికే ఎనర్జీ డ్రింక్స్ కన్నాఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ డ్రింక్ తాగటం వలన మన శరీరానికి అదనంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.