Healthhealth tips in telugu

1 గ్లాస్ తాగితే చాలు డయాబెటిస్,నరాల బలహీనత,అధిక బరువు అనేవి జీవితంలో ఉండవు

Diabetes amla juice : ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ నిర్వహణలో ఆహారం కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.

ఇప్పుడు చెప్పే డ్రింక్ ప్రతి రోజు ఉదయం తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో నరాల బలహీనత అనేది కొంతమందిలో కనిపిస్తుంది. ఆ సమస్యను కూడా ఈ డ్రింక్ తగ్గిస్తుంది. ఈ డ్రింక్ తయారీ కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.

ఒక ఉసిరికాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 10 కరివేపాకు ఆకులు, అంగుళం దాల్చినచెక్క ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని గ్లాసులోకి వడకట్టి గోరువెచ్చగా అయ్యాక ఉసిరిరసం కలిపి తాగాలి. ఈ డ్రింక్ ప్రతి రోజు ఉదయం తాగాలి.

గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు. బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగితే సరిపోతుంది. ఈ డ్రింక్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి కూడా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.