పిల్లలకు చదివిన విషయాలు గుర్తు ఉండటం లేదా… ఏకాగ్రత ఉండటం లేదా … అయితే వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చితే సరి
Childrens Exam Diet : పిల్లలకు పరీక్షల సమయం వచ్చేసింది. ఇప్పుడు ఏకాగ్రతగా చదువు మీద శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది. ఈ సమయంలో మంచి పోషకాలు ఉన్న ఆహారం పెట్టాలి. గోధుమలు,సజ్జలు,రాగుల వంటి చిరు ధాన్యాలను తీసుకోవటం వలన మెదడుకు తగినంత శక్తి సరఫరా అయ్యి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభించే ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు తీసుకోవటం వలన పిల్లల్లో ఒత్తిడి తగ్గుతుంది. విటమిన్ సి సమృద్ధిగా లభించే ఆహారాలను తీసుకోవటం వలన పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో ఉండే మేలు చేసే మంచి కొవ్వులు, విటమిన్ బి, మాంస కృత్తులు మెదడుకు గ్రాహ్య శక్తిని పెంచటంలో సహాయపడతాయి.
చేపలతో సమృద్ధిగా ఉండే ఒమేగా, విటమిన్ d మతిమరుపును తగ్గించి గ్రాసింగ్ పవర్ ని పెంచుతాయి. దాంతో ఏమి చదివిన బాగా గుర్తు ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాట్స్ సమృద్ధిగా ఉండే వెన్న తీసుకోవటం వలన మెదడు సరిగా పనిచేయటానికి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
చూసారుగా ఫ్రెండ్స్ మీ పిల్లలకు ఈ ఆహారాలను అందించి జ్ఞాపకశక్తి పెరిగేలా చూడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.