Healthhealth tips in telugu

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే అద్భుతమైన పానీయం

మెంతులను మనం ప్రతి రోజు వంటల్లో వేస్తూ ఉంటాం. ప్రతి ఇంటిలోనూ పోపు గింజలలో మెంతులను వాడుతూ ఉంటాం. మెంతులను ఎక్కువగా పచ్చళ్లలో,పులుసు కూరల్లో వేస్తూ ఉంటారు. మెంతులను వేయటం వలన వంటలకు మంచి రుచి,వాసన వస్తుంది. మెంతులు మన ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
Joint Pains Home Remedies in telugu
ముఖ్యంగా అధిక బరువు సమస్య ఉన్నవారికి దివ్య ఔషధమని చెప్పవచ్చు. మారుతున్న బిజీ జీవనశైలి,ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవటం వంటి కారణాలతో శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోవటం జరుగుతుంది. ఈ కొవ్వు కారణంగా ఎన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుండి బయట పడటానికి మరియు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవడానికి ఈ రోజు మెంతులను ఉపయోగించి ఒక అద్భుతమైన పానీయాన్ని తయారుచేసుకుందాం.
gas troble home remedies
మెంతులలో ఫైబర్ అధికంగా ఉండుట వలన జీర్ణక్రియను వేగవంతం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా ప్రోత్సహిస్తుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో సుగర్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారికి కూడా మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి.

ఇప్పుడు శరీరంలో కొవ్వు తగ్గటానికి పానీయాన్ని ఎలా తయారుచేసుకోవాలో తెలుస్కుందాం. ఒక గిన్నెలో కప్పున్నర నీటిని తీసుకొని దానిలో రెండు స్పూన్ల మెంతులు వేసి బాగా మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయ్యాక త్రాగాలి. ఈ పానీయంను ఏ సమయంలో ఎలా వాడితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుందో తెలుసుకుందాం.
fenugreek seeds Benefits in telugu
ఈ పానీయాన్ని ఉదయం పరగడుపున త్రాగాలి. ఈ పానీయం త్రాగిన గంట వరకు ఏమి తినకూడదు. గంట తర్వాతే బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఒకవేళ ఉదయం త్రాగటం కుదరని వాళ్ళు రాత్రి పడుకొనే ముందు త్రాగవచ్చు. ఈ పానీయాన్ని నెల రోజుల పాటు క్రమం తప్పకుండా త్రాగితే శరీరంలో జీర్ణక్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది.
Acidity home remedies
ఈ పానీయాన్ని ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకొనే ముందు గాని తీసుకోవచ్చు. రాత్రి సమయంలో త్రాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అదే ఉదయం పరగడుపున త్రాగితే తీసుకోబోయే ఆహారం బాగా జీర్ణం కావటానికి కావలసిన పరిస్థితులను కల్పిస్తుంది. మీ వీలును బట్టి ఉదయం,రాత్రి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ విధంగా నెల రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. అయితే ఆస్తమా తో బాధపడేవారు కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పానీయాన్ని తీసుకోకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.