ఒక్క మూడు నిముషాలు మీవి కావని అనుకుంటే…. అధిక బరువు తగ్గే డైట్ ప్లాన్ … డోంట్ మిస్…!
అధిక బరువు సమస్య అనేది ఇప్పుడు సాధారణం అయ్యిపోయింది. ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఒక్కరు ఉంటున్నారు. మారిన జీవనశైలి మరియు తీసుకొనే ఆహారం ఎక్కువ అయ్యి పని తక్కువ అయినప్పుడు బరువు పెరుగుతాం. ఈ రోజుల్లో ఎక్కువగా జంక్ ఫుడ్స్ మీద ఆధారపడుతున్నారు. బరువు పెరుగుతున్నామని అంటే మనం మొదటగా ఆలోచించాల్సింది ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నాం.
ఆ కేలరీలు ఖర్చు కావటానికి ఎంత పని చేస్తున్నాం అనేది చూడటం ముఖ్యం. ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా బరువు పెరగటం అనేది సర్వ సాధారణం అయ్యిపోయింది. ఇప్పుడు బరువు తగ్గటానికి ఒక మంచి ప్లాన్ గురించి తెలుసుకుందాం.
ఉదయం లేవగానే రెండు గ్లాసుల మంచి నీళ్ళు త్రాగాలి. అలవాటు లేని వాళ్ళు ఒక గ్లాస్ మంచి నీళ్లు త్రాగాలి. అలాగని లీటర్ నీటిని ఒక్కసారిగా త్రాగకూడదు.
ఆ తర్వాత బాదం పప్పు తినాలి. మగవారైతే 6 నుంచి 8 వరకు, ఆడవారైతే 4 నుంచి 6 వరకు బాదం పప్పులను తీసుకోవచ్చు.
బాదం పప్పులను తిన్న పది నిమిషాలకు 100 ml కాఫీ లేదా టీ తీసుకోవాలి. కాఫీ,టీ అలవాటు లేనివారు పాలను తీసుకోవచ్చు.
బ్రేక్ ఫాస్ట్ 8 నుంచి 9 గంటల మధ్యలో తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వలన రోజు మొత్తం కేలరీలు శరీరానికి అందుతాయి. అలాగే మెదడు కూడా చాలా చురుకుగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ చేయని వారిలో బరువు తగ్గే అవకాశం తక్కువగా ఉండటమే కాకుండా చాలా డల్ గా ఉంటారు.
మిడ్ మార్నింగ్ స్నాక్స్ కింద రెండు బిస్కెట్స్ లేదా ఒక ఫ్రూట్ తీసుకోవాలి.
మధ్యాహ్నం లంచ్ లో ఒక చపాతీ, ఒక చిన్న కప్పు అన్నం ,ఒక కప్పు కర్రీ,వెజిటేబుల్ సలాడ్,పెరుగు ఉండేలా చూసుకోవాలి.
మధ్యాహ్నం 3 గంటలకు 100 ml కాఫీ లేదా టీ తీసుకోండి.
సాయంత్రం ఐదు గంటలకు వారంలో మూడు రోజులు నచ్చిన స్నాక్స్ ,మిగతా నాలుగు రోజులు ఫ్రూట్ సలాడ్ లేదా విజిటెబుల్ సలాడ్ గాని తీసుకోవాలి.
రాత్రి సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే రాత్రి ఆహారం తీసుకున్నాక పడుకుంటాం కాబట్టి కేలరీలు ఖర్చు కావు. దాంతో బరువు పెరుగుతాం. అందువల్ల రాత్రి సమయంలో ఆహారం తక్కువగా తీసుకోవాలి. ఒక కప్పు కర్రీ,రెండు చపాతీలు లేదా ఒక కప్పు రైస్ లేదా ఒక కప్పు కొర్రల అన్నం తినవచ్చు. భోజనం అయ్యాక అరగంట అయ్యాక ఒక ఫ్రూట్ తీసుకోండి.
ఈ విధంగా డైట్ ఫాలో అయ్యి 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తూ ఉంటే బరువు సులభంగా తగ్గిపోతారు. అయితే అధిక బరువు ఉన్న వారు అంటే 60 కేజీల బరువు ఉండాల్సినవారు 85 కేజీల బరువు ఉంటే మాత్రం డాక్టర్ సలహాతో డైటింగ్ చేయాలి. అలాంటి వారికీ ఈ డైటింగ్ సెట్ కాదు.
చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ డైట్ ఫాలో అయ్యి అధిక బరువును సులభంగా తగ్గించుకోండి.