నల్ల వెల్లుల్లిని ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Black Garlic Health benefits : మనం ఎక్కువగా తెల్ల వెల్లుల్లిని ఉపయోగిస్తాం. అయితే తెల్ల వెల్లుల్లితో పోలిస్తే నల్ల వెల్లుల్లిలో పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. తెల్ల వెల్లుల్లి నుంచే కిణ్వ ప్రక్రియలో నల్ల వెల్లుల్లిని తయారుచేస్తారు.ఇది తెల్ల వెల్లుల్లి వలె.. ఘాటైన వాసన, రుచిని కలిగి ఉండదు.
Black garlic Benefits
పచ్చి వెల్లుల్లి కంటే.. నల్ల వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నల్ల వెల్లుల్లి మెదడు పనితీరును మెరుగుపరచి వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇది సహజ శోథ నిరోధకంగా పనిచేస్తుంది. అలాగే కాలేయం పనితీరు బాగుండేలా చేసి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నల్లవెల్లుల్లి సహాయం చేస్తుందని.. కొన్ని పరిశోదనల్లో తేలింది. నల్ల వెల్లుల్లిలో ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి.. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో డయాబెటీస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటీస్ కారణంగా వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి.

నల్ల వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఫలితంగా రక్త ప్రవాహాన్ని పెంచేటప్పుడు మీ గుండె, ధమనులలో వాపును తగ్గిస్తుంది. ఇది మీ లిపిడ్ ప్రొఫైల్​ను మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. దాంతో రక్తపోటు కూడా నియంత్రణలో ఉండి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.