15 రోజులు తాగితే డయాబెటిస్,కొలెస్ట్రాల్,రక్తపోటు,అధిక బరువు,గుండె సమస్యలు ఉండవు

kalonji seeds Benefits : ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే కలోంజీ సీడ్స్ వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ గింజలతో టీ తయారుచేసుకొని తాగితే డయాబెటిస్,కొలెస్ట్రాల్,రక్తపోటు,అధిక బరువు,గుండె సమస్యలు, రక్త నాళాల్లో బ్లాక్స్ వంటివి అన్నీ తగ్గుతాయి.

రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో అరస్పూన్ కలోంజీ సీడ్స్ వేసి మరుసటి రోజు ఉదయం పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ సొంపు వేసి 2 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత పటికబెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగాక గ్లాస్ లోకి వడకట్టి ఉదయం సమయంలో తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు పటికబెల్లం లేకుండా తాగాలి.

ఊపిరితిత్తులలో నిమ్ము ఉన్నవారు,గొంతులో కఫం ఉన్నవారు,పిత్తాశయంలో సమస్యలు ఉన్నవారు పటికబెల్లం బదులు తేనెను వాడాలి. కలోంజీ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. అయితే కలోంజీ సీడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ గింజలకు వేడి చేసే గుణం ఉంది.

ఈ టీని 15 రోజుల పాటు ఉదయం సమయంలో తాగితే చాలా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కలోంజీ సీడ్స్ ఆయుర్వేదం షాప్ లో లభ్యం అవుతాయి. లేదా Online Stores లో కూడా విరివిగానే లభ్యం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.