వేసవిలో ఇలా చేస్తే జుట్టు ఊడటం తగ్గి నల్లగా,పొడవుగా పెరుగుతూనే ఉంటుంది

Summer Special Hairpack for Hair Growth : ఈ వేసవిలో జుట్టు సంరక్షణ కొరకు ఒక ప్యాక్ గురించి తెలుసుకుందాం. జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య అనేవి వచ్చాయంటే అంతా తొందరగా వదలవు. వీటిని తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం కనపడక చాలా నిరాశ చెందుతారు.
Hair fall Tips in telugu
అలా కాకుండా ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. మిక్సీ జార్ లో గుప్పెడు గుంట గలగర ఆకు , పది మందార ఆకులు,రెండు మందార పువ్వులు,గుప్పెడు వేప ఆకులు, రెండు అంగుళాల కలబంద ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా తెల్లజుట్టు కూడా నల్లగా మారుతుంది. సహజసిద్దంగా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవాలి.

ఈ ప్యాక్ లో వాడిన అన్నీ ఇంగ్రిడియన్స్ జుట్టుకి పోషణ అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. జూటూ రాలటానికి ప్రధాన కారణం అయిన చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. తెల్ల జుట్టు సమస్య,జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య ఉన్న వారికి మంచి చిట్కా అని చెప్పవచ్చు. ముఖ్యంగా వేసవిలో జుట్టు సమస్యలకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.