Healthhealth tips in telugu

1 గ్లాసు రక్తహీనత,అలసట,నీరసం,నాడీ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది

Dates and almond milk benefits : ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రోజు డ్రై ఫ్రూట్స్ తో పాలను తయారుచేసుకుందాం. దీని కోసం ముందుగా ఒక బౌల్ లో 10 గింజలు తీసిన ఖర్జూరాలు, 10 జీడిపప్పులు, పది బాదం పప్పులు,అరకప్పు వేడి పాలను పోసి పావుగంట నానబెట్టాలి.
Health Benefits of Dates
నానిన డ్రై ఫ్రూట్స్ ని పాలతో సహ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు కప్పుల పాలను పోసి కొంచెం వేడి అయ్యాక మిక్సీ చేసిన పేస్ట్ వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె వేసి కలపాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన బాదం,పిస్తా,బాదం పప్పు ముక్కలను వేసి బాగా కలపాలి.

చివరగా పావుస్పూన్ లో సగం యాలకుల పొడి వేసి బాగా కలిపి గ్లాస్ లో పోసి తాగాలి. ఇప్పుడు చెప్పిన ఇంగ్రిడియన్స్ తో చేస్తే రెండు గ్లాసుల పాలు తయారవుతాయి. ఈ పాలను ప్రతి రోజు తాగుతూ ఉంటే ఎముకలకు సంబందించిన సమస్యలు,రక్తహీనత సమస్యలు ఉండవు. అలాగే అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉంటారు.

నాడీ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఒత్తిడి,ఆందోళన వంటివి లేకుండా శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫైబర్ మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన పెరిగే పిల్లలకు ఇస్తే చాలా మంచిది. వారి ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.