5 నిమిషాల పాటు ఈ నూనెతో అరికాళ్ళపై మసాజ్ చేస్తే ఏమి అవుతుందో తెలుసా?
Foot massage health benefits : ప్రతి రోజు రాత్రి సమయంలో ఆరికాళ్ళకు నూనెతో మసాజ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మన అరికాళ్ళలో ఉన్న కొన్ని పాయింట్స్ నరాలకు అనుసందానం అయ్యి ఉంటాయి. కాబట్టి రాత్రి సమయంలో నూనెతో మసాజ్ చేస్తే ఆ నరాలు యాక్టివేట్ అయ్యి ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె,ఒక స్పూన్ బాదం నూనె,ఒక స్పూన్ నువ్వుల నూనె వేసి బాగా కలిపి కొంచెం వేడి చేసి అరికాళ్ళకు మసాజ్ చేయాలి. ఈ నూనెలలో ఉన్న పోషకాలు నొప్పులను తగ్గిస్తాయి. ఈ నూనెను ఎక్కువ మోతాదులో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. కంటికి సంబందించిన సమస్యలు తగ్గుతాయి.
రక్తప్రసరణ బాగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా పాదాల తిమ్మిర్లు,చేతుల్లో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. వారికి కూడా ఈ నూనెతో మసాజ్ చేస్తే మంచి ఉపశమనం ఉంటుంది. పాదాల నుండి మోకాళ్ళ వరకు నొప్పులు ఉన్నవారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది.
ఈ నూనెను రెండు చుక్కలు తీసుకొని నాబిలో వేసి మసాజ్ చేయటం వలన కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మంచి నిద్ర పడుతుంది. నిద్రలేని సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.