Healthhealth tips in telugu

ఒక్కసారి రాస్తే చాలు మడమ నొప్పి తగ్గి జీవితంలో అసలు ఉండదు

How to cure heel pain at home in Telugu : మడమ నొప్పి అనేది వచ్చిందంటే విపరీతమైన బాధ ఉంటుంది. మడమ నొప్పి ఉన్నప్పుడూ పనులు చేయటానికి కూడా చాలా బాధగా ఉంటుంది. ఈ నొప్పి అనేది ఒక పట్టానా తగ్గదు. మడమ నొప్పి అనేది గట్టి నేల మీద బలంగా పరుగెత్తటం, ఎక్కువసేపు నిలబడే ఉండటం.. ఏదైనా కారణం వలన కండరం మీద తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు వస్తుంది.

రాత్రి పడుకొని ఉదయం మంచం దిగుతూనే కాలు నేల మీద పెట్టాలంటే చాలామందికి నరకం కనిపిస్తుంటుంది. అంత బాధ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వేసుకున్న ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అంతేకాక ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.

బంగాళాదుంప మడమ నొప్పిని తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే సైందవ లవణం కూడా నొప్పిని తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. బంగాళాదుంపను శుభ్రంగా కడిగి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. ఆతర్వాత సైందవ లవణం వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టి ఒక క్లాత్ చుట్టాలి. అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒక సారి,సాయంత్రం ఒకసారి చేస్తూ ఉంటే మడమ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా రెండు లేదా మూడు రోజులు చేస్తే మడమ నొప్పి క్రమంగా తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.