Healthhealth tips in telugu

నిమిషంలో గ్యాస్,అజీర్ణం,కడుపులో మంట పోగొట్టే సూపర్ టిప్

Acidity home remedies :ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గ్యాస్, కడుపులో మంటతో చాలా ఎక్కువమంది బాధపడు తున్నారు. సమయానికి భోజ‌నం చేయ‌కపోవడం, కారం, మ‌సాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం…ఇలా కార‌ణాలు ఏమున్నా క‌డుపులో మంట‌, గ్యాస్ స‌మ‌స్య‌లు మ‌నల్ని విపరీతంగా బాధిస్తుంటాయి.
Honey benefits in telugu
అయితే ఇందుకోసం మెడిక‌ల్ షాపుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ప‌లు ప‌దార్థాల‌తోనే ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. అది ఎలాగో మీరే చూడండి…ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ తేనెను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని భోజ‌నానికి గంట ముందుగా లేదా భోజ‌నం చేసిన గంట తర్వాత తీసుకోవాలి.

లేదంటే రాత్రి పూట నిద్రపోవటానికి అరగంట ముందు కూడా తాగ‌వ‌చ్చు. దీంతో క‌డుపులో మంట‌, గ్యాస్ త‌గ్గుతాయి. తీసుకున్న ఆహారం కూడా బాగా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్ సమస్య వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు చాలా తొందరగా తగ్గించుకోవాలి. లేదంటే అది ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది.

కాబట్టి వచ్చిన ఏ సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. సమస్య చిన్నగా ఉన్నపుడే పరిష్కారం చూసుకోవాలి. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.