ఈ ఆకు కీళ్ల నొప్పులు,వెన్ను నొప్పులు,నిద్రలేమి,డయాబెటిస్,కిడ్నీ సమస్యలు లేకుండా చేస్తుంది

Arthritis Home remedies : ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. చాలా చిన్న వయస్సులోనే ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు అలాగే సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన డ్రింక్ తాగితే సరిపోతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
sompu
రాత్రి సమయంలో ఒక గిన్నెలో మూడు బిరియాని ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఈ నీటిని పొయ్యి మీద పెట్టాలి. దీనిలో అరస్పూన్ సొంపు వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. బాగా మరిగిన ఈ నీటిని వడకట్టి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి.

ఈ నీటిని తాగటం వలన కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా డయబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ నీటిని రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

అలాగే కిడ్నీలో ఉండే చిన్న చిన్న రాళ్ళను కరిగిస్తుంది. జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడు తున్నవారు కూడా రాత్రి సమయంలో తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా చేస్తే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.