1 స్పూన్ గింజలు శరీరంలో వేడిని తగ్గించటమే కాకుండా కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తాయి
Sabja seeds Benefits in telugu : వేసవికాలం ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండలకు అలసట,నీరసం వచ్చేస్తాయి. నీరసం లేకుండా చురుకుగా ఉండాలన్నా, శరీరంలో వేడిని తగ్గించాలన్నా, శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించాలన్నా ఇప్పుడు చెప్పే గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
ఆ గింజలు సబ్జా గింజలు. చాలా చవకగా దొరికే ఈ గింజలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక స్పూన్ గింజలను నీటిలో నానబెట్టి తింటే చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. సబ్జా గింజలు నీటిలో వేసి అరగంట నానబెడితే జెల్లీలా ఉబ్బుతాయి. దీనిలో నిమ్మరసం,తేనె కలిపి తాగవచ్చు.
ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లో కలిపి తాగవచ్చు. ఎలా తీసుకున్న ప్రతి రోజు ఒక స్పూన్ గింజలను తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది. నీరసం, అలసట,నిస్సత్తువ తగ్గి రోజంతా హుషారుగా ఉంటారు. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారికి చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది.
సబ్జా గింజలలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేయటమే కాకుండా తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది.
అంతే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. వేసవిలో కలిగే డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.