అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టే “టీ”…అసలు మిస్ కాకుండా తాగండి
High Blood Pressure Remedies : ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో అధిక రక్తపోటు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా మందులను వాడాలి. ఒక్కసారి బీపీ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే.
అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే “టీ” ని తాగితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మందార పువ్వులతో టీ తయారు చేసుకొని తాగితే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దాదాపుగా ప్రతి ఇంటిలోనూ మందార చెట్టు ఉంటుంది. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని ఈ టీ తయారు చేసుకుంటే సరిపోతుంది. డ్రై మందార పువ్వుల పొడి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.
కానీ తాజా పువ్వులు అయితే ఎక్కువ శాతం మంచి ఫలితాన్ని పొందవచ్చు. మందార పువ్వుల టీని ఎలా తయారుచేయాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి రెండు మందార పువ్వుల రేకలను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ టీని గ్లాస్ లో పోసి అరచెక్క నిమ్మరసం,ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి.
డయాబెటిస్ నియంత్రణకు కూడా బాగా సహాయపడుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. మందార పువ్వులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ బి1 మరియు ఐరన్, ఫ్లేవనాయిడ్ గ్లైకోసైడ్‌లు సమృద్దిగా ఉంటాయి. ఈ టీని రోజులో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.