2 స్పూన్స్ ఊపిరితిత్తులలో పేరుకున్న కఫము,శ్లేష్మంను శుభ్రం చేసి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది

Clean Your Lungs in 3 days In telugu : ఈ రోజు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం మరియు శ్లేష్మం తొలగించుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. ఊపిరితిత్తులలో కఫం మరియు శ్లేష్మం ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవటం చాలా కష్టం అవుతుంది. దీని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

మన శరీరంలోని టాక్సిన్లను బయటకు తీయడంలో ఊపిరితిత్తులు సహాయపడతాయి. మన శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే, ఊపిరితిత్తులు బాగా పనిచేయాలి. ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే శరీరంలోని ప్రతి భాగానికి చేరుకుంటుంది. కాబట్టి ఊపిరితిత్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.
garlic
ఒక గిన్నెలో అరలీటర్ నీటిని పోసి దానిలో రెండు స్పూన్ల పంచదార వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. 200 గ్రాముల వెల్లుల్లిని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. అలాగే
బ్రోన్కైటిస్ మరియు న్యుమోనియాను తగ్గిస్తుంది.
Ginger benefits in telugu
వెల్లుల్లి ఒక శక్తివంతమైన సహజసిద్దమైన యాంటీబయాటిక్ గా పనిచేసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనేది ఊపిరితిత్తులలోని మందపాటి శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేస్తుంది.అదే సమయంలో, ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి కూడా సహాయపడుతుంది. 50 గ్రాముల అల్లంను శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
weight loss tips in telugu
అల్లం బలమైన శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉండటం వలన ఊపిరితిత్తులలో శ్లేష్మం తొలగించడానికి మరియు శుభ్రం చేయటానికి సహాయ పడుతుంది. పంచదార కలిపిన నీటిని పొయ్యి మీద పెట్టి దానిలో వెల్లుల్లి ముక్కలు,అల్లం ముక్కలు, ఒక స్పూన్ పసుపు వేసి 7 నిమిషాల పాటు మరిగించి…ఆ తర్వాత సీసాలోకి వడకట్టి దానిలో రెండు నిమ్మకాయ slices వేసి మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి.

ప్రతి రోజు రెండు స్పూన్లు తీసుకుంటే మూడు రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది. అయితే ఈ విధంగా నెల రోజుల పాటు తీసుకుంటే ఊపిరి తిత్తులలో పేరుకున్న కఫము,శ్లేష్మం శుభ్రం అయ్యి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ సిరప్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.