Healthhealth tips in telugu

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే…ముఖ్యంగా ఈ సీజన్ లో…ఇవి తప్పనిసరి

Foods For Lungs : ఊపిరితిత్తులు అనేవి శరీరంలో ముఖ్యమైన భాగాలలో ఒకటి. వీటిని ఆరోగ్యంగా ఉండేలా చూసుకునే బాధ్యత కచ్చితంగా ఉండాలి. దానికోసం కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ఊపిరితిత్తులకు మేలు చేసే ఆహారాలను తీసుకోవాలి. ఈ సీజన్లో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా నీటిని తాగాలి.దానిమ్మ గింజలు లేదా జ్యూస్ ప్రతి రోజు తీసుకుంటే…వాటిలో ఉండే లక్షణాలు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
apple
ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని చెప్పుతు ఉంటారు. ఆపిల్ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. ఆపిల్ లో ఉండే పోషకాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ సీజన్ లో వచ్చే ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తుంది.
Ginger benefits in telugu
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది ఆస్తమా ఉన్నవారికి చాలా మంచిది. అల్లం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకి హాని చేసే శ్లేష్మం బయటికి వెళ్ళిపోతుంది. దీని వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం బాగుంటుంది. ఊపిరితిత్తులు మరింత ప్రభావవంతంగా పనిచేయటానికి సహాయపడే అనేక రసాయన మిశ్రమాలు అల్లంలో ఉన్నాయి. రోజుకి ఒక అంగుళం అల్లం ముక్కను ఆహారంలో బాగంగా చేసుకోవాలి.
weight loss tips in telugu
పసుపును మనం ప్రతి రోజు వంటలలో వాడుతూ ఉంటాం. పసుపు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే కాంపౌండ్‌ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఊపిరితిత్తులకి వచ్చే సమస్యలను తగ్గించటానికి మరియు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడటానికి సహాయపడతాయి. ఒక గ్లాస్ పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగితే చాలు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.