ఈ పొడిని మజ్జిగలో కలిపి తాగితే రోగ నిరోధక శక్తిని పెంచి అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది

Karakkaya Health Benefits : కరక్కాయ అంటే మనలో చాలా మందికి దగ్గును నయం చేస్తుందని మాత్రమే తెలుసు. దగ్గు వచ్చినప్పుడు కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే కరక్కాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కరక్కాయలో టానిన్లు, ఆంత్రోక్వినోన్స్, పాలీఫెనాల్స్ సమృద్దిగా ఉండుట వలన గ్యాస్ సమస్యను తగ్గించటానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు మజ్జిగలో పావు స్పూన్ లో సగం కరక్కాయ పొడిని కలిపి తీసుకుంటే సరిపోతుంది. ప్రేగు కదలికలను పెంచి సాఫీగా మలవిసర్జనలో కూడా సహాయపడుతుంది.
gas troble home remedies
కరక్కాయలో విటమిన్ C మరియు రోగనిరోధక శక్తిని పెంచే 4 రసాయన సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ మరియు యాంటీవైరల్ గా కూడా పనిచేస్తాయి. ఈ సమ్మేళనాలు ప్రేగులలోకి ప్రవేశించిన తర్వాత చెడు బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయి. పేగులో హానికరమైన బ్యాక్టీరియా ఉంటే, రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది
Weight Loss tips in telugu
పేగులో రోగనిరోధక శక్తి సరిగ్గా ఉన్నప్పుడు, శరీరం చురుకుగా ఉండటానికి, మంటను తగ్గించటానికి సహాయపడుతుంది. కరక్కాయ బరువును తగ్గించటానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో జీవక్రియను సక్రియం చేసి మైటోకాండ్రియా యొక్క పనితీరును ప్రోత్సహిస్తుంది. మైటోకాండ్రియా గ్లూకోజ్‌ని తీసుకొని బర్న్ చేసి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఆ విధంగా శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. దాంతో బరువు తగ్గటమే కాదు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కరక్కాయ పొడి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. మజ్జిగ అంటే ఇష్టం లేని వారు ఈ పొడిని వేడి నీటిలో కూడా కలుపుకొని తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.