Healthhealth tips in telugu

బ్రేక్ ఫాస్ట్ సమయంలో తాగితే బరువు తగ్గటమే కాకుండా అలసట,నీరసం లేకుండా చురుకుగా ఉంటారు

Weight Loss Super Drink :ఈ మధ్య కాలంలో జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా డయాబెటిస్, గుండె సమస్యలు వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. .
Weight Loss tips in telugu
అందుకే బరువు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా సహజ సిద్ధంగా మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. .
Fig Fruit Benefits in telugu
అలాగే రోజంతా అలసట, నీరసం లేకుండా హుషారుగా ఉండవచ్చు. ఇప్పుడు చెప్పే డ్రింక్ ప్రతిరోజు ఉదయం తాగితే 15 రోజుల్లోనే తేడా గమనిస్తారు. ఒక బౌల్ లో ఆరు నల్ల ఎండు ద్రాక్ష, రెండు వాల్ నట్స్, రెండు అంజీర్, 4 బాదం పప్పులు, ఒక కప్పు నీటిని వేసి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం నీటితో సహ డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ జార్ లో వేసి మిక్సీ చేయాలి. బాదం పప్పును తొక్క తీసి వేయాలి.
Health Benefits of Dates
ఆ తర్వాత ఒక కప్పు పాలు, గింజలు తీసిన మూడు ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మరోసారి గ్రైండ్ చేస్తే ఎంతో రుచికరమైన హెల్తీ డ్రింక్ సిద్ధమవుతుంది. ఈ డ్రింక్ ని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.

ఈ డ్రింక్ తాగటం వలన జీవ క్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. దాంతో వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా చురుకుగా పనులు చేసుకుంటారు. మెదడు షార్ప్ గా తయారయ్యి మంచి ఆలోచనలు వస్తాయి. అంతేకాకుండా గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/