శరీరంలో కొవ్వును కరిగించే అద్భుతమైన ఆకు…ప్రతి ఒక్కరికి తెలిసిన ఆకు…ఏమిటో…!
Hibiscus tea for weight loss In Telugu :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగటం అనేది సులువుగా జరిగిపోతుంది. బరువు తగ్గడం అనేది చాలా కష్టంగా జరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం పెద్దగా ఉండదు.
అయితే బరువు తగ్గించడంలో మందార ఆకులు చాలా బాగా సహాయపడుతాయి. మందార ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి గ్లాసు నీటిలో వేసి మరిగించి వడగట్టి తేనె కలిపి తీసుకోవాలి. ప్రతిరోజు ఇలా తీసుకుంటే శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. అలాగే అలసట నీరసం నిస్సత్తువ అన్ని తొలగిపోయి తక్షణ శక్తి లభిస్తుంది.
మందార ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.మందార ఆకు టీ LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దాని కంటెంట్ ధమనుల లోపలి భాగంలో పొరలు ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా మీ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
అలానే ఇది బాడీ టెంపరేచర్ ని కూడా మెయింటెన్ చేస్తుంది. రక్త నాళాల ద్వారా రక్త ప్రవాహం బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ సీజన్ లో వచ్చే జలుబు మరియు దగ్గును కూడా మందార ఆకులు నివారిస్తుంది. మందార ఆకులలో అనేక యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించటానికి సహాయం చేయుట వలన వృద్ధాప్య ప్రక్రియ మందగిస్తుంది. దాదాపుగా ప్రతి ఇంటిలో మందార మొక్క ఉంటుంది. కాబట్టి మందార ఆకులను ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్నీ రకాల ప్రయోజనాలను పొందటానికి ప్రయత్నం చేయండి. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.